యాదమ్మ రాజు - స్టెల్లా కాపురంలో సుప్రీతా చిచ్చు..షోకి వచ్చి గొడవ చేసిన స్టెల్లా
on Mar 27, 2025
చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కే ఈ వీక్ ఎపిసోడ్ ఫుల్ జోష్ తో ఎంటర్టైన్ చేసింది. ఉగాది స్పెషల్ గా వచ్చిన ఈ షోలో మంచి కామెడీతో ఆడియన్స్ ని అలరించింది. ఐతే యాదమ్మ రాజు - స్టెల్లా మధ్యలో చిచ్చు పెట్టింది సుప్రీతా. దాంతో షోకి స్టెల్లా వచ్చి గొడవ పెట్టుకుంది. ఈ ఉగాది సందర్భంగా చెఫ్ జీవన్ ఐతే బూందీ లడ్డు అలాగే మామిడికాయ పులిహోర రెడీ చేయమని చెప్పాడు. దాంతో కంటెస్టెంట్స్ అంతా పోటీ పడ్డారు. ఇక సుమ ఐతే ఈ షోలో వడ్డాణం పెట్టుకుని కాసేపు అలరించింది. రాజీవ్ కనకాల తన భార్య సుమకి వడ్డాణం కొనిపెడితే దీపికా వచ్చి "సుమ గారు రాజా గారిని అడిగి నాకు ఒక నెక్లెస్ కొనమనండి" అని ముద్దుగా అడిగేసరికి "ఇంకా నయం ఒక మొగుడిని అడగలేదు" అంటూ సుమ కౌంటర్ వేసింది.
వెంటనే జీవన్ కూడా సుమ గారు మీకు ఈ వడ్డాణం సూటయ్యింది అని కాంప్లిమెంట్ ఇచ్చాడు. దాంతో కుళ్లిపోయిన యాదమ్మ రాజు "దయచేసి ఆ వడ్డాణం తీసేయండి...నా పెళ్ళాం చూస్తే అది కావాలి అంటుంది" అన్నాడు సీరియస్ గా. "ఐనా అందరూ రాజీవ్ కనకాలలా ఉంటారా ఏమిటి ఐనా నువ్వు పది సార్లు స్టెల్లా నాకు షోకి వచ్చేస్తుందేమో"అన్నది సుమ. "అంత సీన్ లేదులే" అని యాదమ్మ రాజు అనే లోపు షోలోకి వచ్చేసింది స్టెల్లా. "ఆంటీ ఏమయ్యింది" అని భార్యను ఆంటీ అని పిలిచేసరికి ఆమెకు కోపం వచ్చేసింది. "సుప్రీతాతో పరిచయం అవగానే నేను ఆంటీని ఇపోయానా..ఇంట్లో నన్ను వదిలేసి వచ్చి ఇక్కడ మంచిగా వంట చేస్తున్నావా...నేను ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు సుమక్క ఏ రోజు నాకు వంట చేసి పెట్టలేదు..అడిగానని ఆ వంట మొత్తాన్ని నాశనం చేసేవాడు దాన్ని తీసుకెళ్లి చెత్తలో పారేసేదాన్ని" అని చెప్పింది. "ఐనా నేను నీతో కలిసి వంట చేయాలా...అది ఇల్లు ఇది షో" అని కౌంటర్ వేసాడు రాజు. "సుప్రీతా కోసం వడ్డాణం కూడా అడిగాడు" అంటూ సుమ కూడా చెప్పేసరికి "ఈ చైన్ కి లాకెట్ కొనమని చాల రోజుల నుంచి అడుగుతున్నా ..కొన్నివ్వట్లేదు" అని చెప్పింది "సంసారం మొత్తాన్ని షోలోకి తెచ్చావ్" అని తిట్టాడు రాజు. దీపికా ఐతే " ఆ స్టెల్లా ఒక డొల్ల..సుప్రీతా సూపర్" అంటూ యాదమ్మ రాజు మా దగ్గర చెప్తున్నాడు అంది. దాంతో ఆ గొడవ కాస్త పెర్సొనలైజ్ ఐపోతోంది తెలిసి సుమ వెళ్లి కలిసిపోండి ఇద్దరు అంది. అక్కా ఇది ప్రాంక్ అని చెప్పేసింది స్టెల్లా.
Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
